యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నెట్ (UGC-NET) డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో( CBT) జరిగే ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులపై మీ ఫొటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌‌ను చెక్ చేసుకోండి. వీటిలో ఏది లేకపోయినా మరోసారి డౌన్ లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది.

UGC NET Admit Cards Released Download Here

జూనీయిర్ రీసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీడేందుకు ఉపయోగపడే ఈ పరీక్ష కోసం డిసెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అడ్మి్ కార్డుల డౌన్‌లో‌డ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నెంబర్ లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది.

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్:

జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో 85 సబ్జెక్టులకు పరీక్ష జరగనుంది. జనవరి 3న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, రూరల్ ఎకనామిక్స్, కో-ఆపరేషన్, డెమోగ్రఫీ, డెవలప్‌మెంట్ ప్లానింగ్, డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామెట్రిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, మ్యూజియాలజీ, తదితర విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎన్టీఏ కూడా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసింది, అభ్యర్థులకు వారి పరీక్షా కేంద్రాల స్థానాల గురించి తెలియజేస్తుంది.

పరీక్షా విధానం:

యూజీసీ నెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలు, PhD ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్ష కీలకం.

పరీక్షా సరళి:

పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి:

పేపర్ 1 : 100 మార్కులు, 50 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు)
ఫోకస్: టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, సాధారణ అవగాహన.
పేపర్ 2 : 200 మార్కులు, 100 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు)
ఫోకస్: ఎంచుకున్న డొమైన్‌లో విషయ-నిర్దిష్ట జ్ఞానం.
పరీక్ష వ్యవధి: పరీక్ష మొత్తం వ్యవధి 3 గంటలు (180 నిమిషాలు), విరామం లేకుండా. అన్ని ప్రశ్నలు తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+