యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యోగాలు: రిజర్వుడ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. బ్యాక్‌లాగ్ రిజర్వుడ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తోంది. 38 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల నియామకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు:
సైన్సెస్, హ్యూమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, పెర్ఫామింగ్ ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్.

అర్హతలు:
సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్/పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
65 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి పూర్వానుభవం, ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము:
రూ. 1000 (ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 10, 2022
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 17, 2022.
మరిన్ని వివరాల కోసం https://uohyd.ac.in/ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications