CISF Recruitment 2021: కేవలం వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 21 చివరి తేదీ కావడంతో ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ పోస్టులకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే, ఈ పోస్టులను కేవలం సీఐఎస్ఎఫ్‌లో అనుభవం ఉన్నవారికే కేటాయించారు.

పోస్టులకు సంబంధించిన వివరాలు:
దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు 2022 జనవరి 1 నాటికి సీఐఎస్ఎఫ్ సబ్ ర్యాంక్‌లో కనీసం నాలుగు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అపాయింట్‌మెంట్ లెటర్ జారీ అయ్యే వరకు సర్వీస్ క్లీన్ రికార్డ్‌ను కలిగి ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థి వయస్సు ఆగస్టు 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు. అంటే, 1987 ఆగస్టు 2 తర్వాత జన్మించిన వారే దరఖాస్తుకు అర్హులు. అయితే, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయో సడలింపు ఉంటుంది.
యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in సంప్రదించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ లేదా హార్డ్ కాపీని సీఐఎస్ఎఫ్ విభాగానికి పంపాలి.












Click it and Unblock the Notifications