Biden scheme: బైడెన్ పథకంపై నీలినీడలు..ట్రంప్ నిర్ణయం కోసం అగ్రరాజ్యం స్టూడెంట్స్‌ వెయిటింగ్

Student Loans: రుణమాఫీల ద్వారా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుందని పలు ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారం కోసం, గొప్పల కోసం ఆయా రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలపై కేంద్రం సహా RBI ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఇదే తరహా వ్యవస్థ అమెరికాలోనూ ఉంది. అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం విద్యా రుణాలపై ఇటువంటి విధానాన్నే అనుసరించాలని భావించింది. దాని పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా కనిపిస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు బైడెన్ గతంలో విద్యా రుణ మాఫీ పథకం ప్రకటించారు. తద్వారా తమ రుణ భారం బకాయిలు తగ్గుతాయని పలువురు ఆశించారు. అయితే దీనికి చట్టపరమైన సవాళ్లు అడ్డంకిగా మారాయి. వివిధ కేసుల కారణంగా ఈ పథకం అమలు నిలిచిపోయింది. దీంతో నెలవారీ EMIలు త్వరలోనే తిరిగి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనుండగా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని యావత్ అమెరికా ఆతృతగా ఎదురుచూస్తోంది.

US people eagerly waiting for Trump action plan on student loans

బైడెన్ ప్రకటించిన విద్యా రుణ మాఫీ పథకానికి రిపబ్లికన్ చట్టసభ్యులు మరియు వివిధ రాష్ట్రాల దావాలు బలమైన ప్రతిఘటనగా నిలిచాయి. లక్షలాది మంది రుణ గ్రహీతల ఆర్థిక భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం ప్రధాన అంశంగా ఉండటంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ట్రంప్ సర్కారు నేరుగా ప్రకటన చేస్తేనే కానీ ఈ విషయంపై స్పష్టత రానుంది.

రుణ గ్రహీతలకు 20 వేల డాలర్ల వరకు రద్దు చేయాలన్న బైడెన్ ప్రభుత్వం ప్రణాళికను గత సంవత్సరం సుప్రీం కోర్టు నిలువరించింది. ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారంలో విద్యా రుణాల రద్దు అనేది ప్రధాన అంశంగా కూడా లేకపోయింది. ఈ ఆటంకాల మధ్య కూడా బైడెన్ సర్కారు కొంత ఉపశమనం అందించగలిగింది. మిలియన్ల మందికి రుణాలను రద్దు చేసింది. రుణాల క్లిష్టత, మాఫీ అర్హతలు మరియు చెల్లింపు ప్రోగ్రామ్లపై అయోమయం వెరసి రుణగ్రహీతలు మరియు వారి కుటుంబాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+