బిగ్ షాక్: ఆ 5 ఓటీటీలు ఇండియాలో బ్యాన్..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయనే కారణంతో మరో 5 OTT ప్లాట్ ఫారమ్ లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన OTT ప్లాట్ ఫారమ్ ల వివరాలు చూస్తే.. MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel, Jugnu.. ఈ ఐదు ఓటీటీలను తాజాగా కేంద్రం బ్లాక్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, పబ్లిక్ డీసెన్సీ, నైతిక విలువలు తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ 5 ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు, అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ ప్రయోజనాలు, ప్రజా మర్యాదలు, నైతికతను కాపాడటానికి ఆన్ లైన్ కంటెంట్ ను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ మేరకు ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. ఈ యాప్‌లు, వెబ్ సైట్ లకు యాక్సెస్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఈమేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. గతంలోనూ కేంద్రం 18 OTT యాప్‌లను బ్లాక్ చేసింది. అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన వీడియోలతో ఉన్న OTT ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను అందించే యాప్‌లపై ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అలాగే భారతీయ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి అనేక యాప్స్ ను కూడా బ్లాక్ చేయాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications