డాంగ్లీ మామ ఏంటి ఇలా మారిపోయావ్..!

సూర్య నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '7th సెన్స్' (2011) గురించి ప్రస్తావన వస్తే, హీరో పాత్రలతో పాటు వెంటనే గుర్తుకు వచ్చేది... భయంకరమైన విలన్ డాంగ్లీ పాత్రే! కోలీవుడ్ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. సూర్య ద్విపాత్రాభినయం (బోధి ధర్ముడు, అరవింద్) శ్రుతి హాసన్ నటన ఆకట్టుకోగా, డాంగ్లీ పాత్ర హైలైట్‌గా నిలిచింది.

మాటలు పెద్దగా లేకుండా, కేవలం తన భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్ మరియు పవర్‌ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను భయపెట్టిన డాంగ్లీని ఇప్పటికీ టీవీల్లో సినిమా వస్తే ప్రత్యేకంగా చూసేవారు ఉన్నారు. సూర్యతో పోటాపోటీగా నటించి, మెప్పించిన ఆ పాత్ర పోషించిన నటుడి అసలు పేరు జానీ ట్రై గుయెన్ .

జానీ ట్రై గుయెన్ మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టంట్ మాస్టర్ కూడా. 'స్పైడర్ మ్యాన్ 2' వంటి హాలీవుడ్ చిత్రాలకు స్టంట్ మ్యాన్‌గా పనిచేశారంటే ఆయన రేంజ్ అర్థమవుతుంది.

భారతీయ సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చింది రామ్ చరణ్ మొదటి చిత్రం 'చిరుత' (2007) ద్వారా. ఆ తర్వాత ప్రభాస్ 'ఏక్ నిరంజన్', మహేశ్ బాబు 'బిజినెస్ మ్యాన్' వంటి సినిమాల్లో కూడా కనిపించినా, '7th సెన్స్'లో పోషించిన డాంగ్లీ పాత్రే ఆయనకు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది.

7th Sense Villain Dong Lee s Transformation Johnny Tri Nguyen s Latest Look Goes Viral After 14 Years
7th సెన్స్ విడుదలై దాదాపు 14 ఏళ్లు కావస్తున్న సందర్భంగా, డాంగ్లీ (జానీ ట్రై గుయెన్) తాజా ఫోటోలు , వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "డాంగ్లీ మామ, ఏంటిలా మారిపోయావు?", "మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తావు?" అంటూ సరదాగా, ఆసక్తిగా కామెంట్లు పెడుతున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+