దేముడు రా మా అన్న..

సూపర్ స్టార్ రజినీకాంత్. విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. 74 సంవత్సరాల వయస్సులోనూ 1,000 కోట్ల రూపాయల సినిమాలను తీయగలుగుతున్నారంటే.. ఆయనకు ఉన్న ఫాన్ బేస్, స్టార్ డమ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ వయస్సులో కూడా భారీ యాక్షన్ సీన్లల్లో నటించగలుగుతున్నారు.

రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ.. కూలీ. ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రపారపాలాడించింది.

A fan performing abhishekam in Sri Rajini Temple

కూలీ మూవీకో ప్రత్యేకత ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత విడుదల కాబోతోన్న మొదటి సినిమా ఇదే. ఎంతో హైప్ క్రియేట్ చేసింది.. ట్రైలర్. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. మాస్ సీన్లతో కట్ చేసిన ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా గత రికార్డులను తుడిచిపెట్టింది.

1975లో కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగళ్'తో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. అయిదు దశాబ్దాల తన కెరీర్‌లో.. సొంత మేనరిజాన్ని క్రియేట్ చేశాడు. ఐకానిక్ డైలాగ్ డెలివరీ, స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

రజినీకాంత్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన డైహార్డ్ ఫ్యాన్ కార్తీక్.. మధురైలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. చక్కెర, కొబ్బరి నీళ్లు, పాలు, పెరుగు, తెనెతో రజినీకాంత్ విగ్రహాన్ని అభిషేకించాడు. స్వీట్లను పంచిపెట్టాడు.

6,000కు పైగా రజినీకాంత్ ఫొటోలతో ఈ ఆలయాన్ని అలంకరించాడు. తలైవా పట్ల తనకు భక్తిని చాటుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించాడు కార్తీక్. 300 కిలోల బరువున్న రజనీకాంత్ విగ్రహాన్ని నెలకొల్పాడు. రజనీకాంత్‌ ను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాడతను.

రజనీకాంత్ 1975లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, నేటికీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతూ, నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ అద్భుతమైన మైలురాళ్లను చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+