కోర్టులోనే అల్లు అర్జున్‌తో సెల్ఫీ..ఇది పుష్పగాడి క్రేజ్(వీడియో)

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఒకరాత్రి ఆయన చర్లపల్లి జైలులో గడపాల్సి వచ్చింది. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం ఆయనకు కోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ తన రెగ్యుల‌ర్ బెయిల్‌కు సంబంధించిన పూచిక‌త్తు పేప‌ర్లను స్వయంగా సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగారు. అల్లు అర్జున్ సైతం అతను అడిగిన వెంటనే సెల్ఫీ ఇచ్చారు.

A fan take a selfie with Allu Arjun in the court premises

అయితే ఆ వ్యక్తి చాలాసేపు ఫొటో దిగడంతో అక్కడున్న పోలీసులు , సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్ధని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+