ఫేమస్ నటి, రాజకీయ నాయకురాలు, రాత్రికిరాత్రే లేపేశారు, హంతకుడు ఎవరో తెలుసా ?
నటిగా, జాతీయ పార్టీ నాయకురాలిగా ఓ మహిళ చాలా ఫేమస్ అయ్యింది. మహిళ పని చేస్తున్న పార్టీ అధికారంలో ఉంది. సొంత పార్టీ అధికారంలో ఉంటే మనకు ఏం భయం లేదని, సినిమాలు, రాజకీయాల్లో ఇక తాను బిజీగా ఉంటానని ఆమె అనుకుంది. ఇంతలోనే ఆ నటి, రాజకీయ నాయకురాలు దారుణ హత్యకు గురైయ్యింది. హత్య చేసిన వ్యక్తి వివరాలు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టీ నరసీపుర తాలుకాలోని తుర్గనూర్ గ్రామంలో విద్యా అనే మహిళ హత్య జరిగింది. మైసూరు సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కన్నడ నటి విద్యా హత్యకు గురికావడంతో మైసూరు జిల్లాతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే విద్యాను ఆమె భర్త హత్య చేశారనే ఆరోపణలున్నాయి.

విద్యా భజరంగీ, వజ్రకాయ తదితర కన్నడ సినిమాల్లో నటించింది.
చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా విద్యా క్రియాశీలకంగా వ్యవహరించారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తరువాత భర్త నందీష్ అతని భార్య విద్యాను హత్య చేశాడని సమాచారం. ఈ కేసు బన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
విద్యాను హత్య చేసిన ఆమె భర్త నందీష్ పరారైనాడు, మంగళవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న విద్యా మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యా హత్య సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విద్యా హత్యకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందని, ఆమె కుటుంబ సభ్యులు, పొరుగువారి నుండి మరింత సమాచారం సేకరిస్తున్నామని మైసూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
ఘటన అనంతరం నిందితుడు నందీష్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
నటి, రాజకీయ నాయకురాలు విద్యా హత్యకు గురైన సంఘటనా స్థలాన్ని మైసూరు జిల్లా సూపరింటెండెంట్ సీమా లట్కర్, అదనపు ఎస్పీ డాక్టర్ నందిని, నంజన్‌గూడు డీవైఎస్పీ గోవిందరాజులు పరిశీలించారు. నిందితుడు నందీష్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, విద్యా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని మైసూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. నటి, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యా హత్యకు గురి కావడంతో ఇటు కన్నడ సినీ రంగానికి చెందిన వారు, కర్ణాటకలోని ప్రభుత్వ పెద్దలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications