సంచలనం.. సినిమాలకు స్టార్ హీరో గుడ్ బై?

దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం ఈ వార్త ఎంతో వైరల్ గా మారింది. స్టార్ హీరోలన్న తర్వాత సాధ్యమైనంత వరకు ఎవరూ నటనకు దూరంగా ఉండరు. ఏవో మరీ పెద్ద కారణాలైతేకానీ.. అందరూ నటిస్తునే ఉంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

దీనికి కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడంలేదు. తనదగ్గరకు కథలు తీసుకొని వస్తున్న దర్శకులకు ఇక సినిమాలు చేయడంలేదని అమీర్ చెప్పేస్తున్నాడంట. చెన్నైలో స్థిరపడబోతున్నట్లు వెల్లడించారంటున్నారు. తల్లికి ఆరోగ్యం బాగుండకపోవడంవల్ల చికిత్స కోసం తరుచుగా చెన్నైలో ఉండాల్సి వస్తోంది. చెన్నైకి వచ్చినప్పుడల్లా కొన్ని నెలల నుంచి ఆయన హీరో విశాల్ ఇంట్లోనే బస చేస్తున్నారు.

A star hero will say goodbye to films

సినిమాలకు గుడ్ బై చెప్పేసి చెన్నైలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఒక లగ్జరీ ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన చివరగా నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఆ సినిమా దారుణమైన డిజాస్టరైంది. ఆ సమయంలో వచ్చిన ట్రోలింగ్ ను అమీర్ భరించలేకపోయారు. ఏ సినిమాకు ఇక కమిట్ అవ్వకూడదని డిసైడయ్యారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

ఎంతో టాలెంట్ కలిగిన అమీర్ ఖాన్ లాంటి నటుడు సినిమాలు మానేస్తున్నారని తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారుకానీ అమీర్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదని, ప్రేక్షకుల అభిరుచులు మారుతుండటంతో ఏ కథ చేసి ఒప్పించాలా? అనే సందిగ్ధంలో అమీర్ ఉండిపోయారని, దీనికన్నా సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిదనే నిర్ణయాన్ని అందుకే తీసుకున్నారని సమాచారం. ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+