స్టార్ హీరోకు షాక్, హత్య కేసులో పోలీసులకు చిక్కిన వీడియో, మొబైల్ ఫోన్ లో తీసి ?
కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో కలకలం రేపే సమాచారం బయటకు వచ్చింది. హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్, కన్నడ నటి పవిత్ర గౌడ విషయంలో రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తీసుకొచ్చి మా మేడమ్ కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తావా అంటూ దాడికి పాల్పడిన వీడియో ఒకటి పోలీసు అధికారుల చేతికి చిక్కిందని వెలుగు చూసింది.
రేణుకాస్వామిని బెంగళూరులోని పట్టగెరె షెడ్డుకు తీసుకొచ్చి దర్శన్ గ్యాంగ్ దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నిందితుడు వినయ్ మొబైల్ ఫోన్‌లో లభ్యమైందని పోలీసులు అంటున్నారు. మూడు సెకన్ల నిడివి గల వీడియో, ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులోని

పట్టనగెరెలోని ఓ షెడ్డులో రేణుకాస్వామిని కొట్టారు. ఈ సమయంలో దర్శన్ గ్యాంగ్ వీడియో తీసి నిందితుడు వినయ్‌కు పంపారు.ఈ మూడు సెకన్ల వీడియో, ఫోటో చూసిన నిందితుడు వినయ్ పట్టనగెరె షెడ్డు వద్దకు వచ్చి అతనిపై దాడి చేశాడు. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో కీలక ఆధారాలు లభించాయి.ఈ వీడియోను నిందితుడు వినయ్‌కు ఎవరు పంపారనే సమాచారాన్ని వినయ్ వెల్లడించలేదు. ఇప్పుడు నిందితులందరి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించేందుకు పోలీసులు సంబంధిత నిపుణులను సంప్రధించారు.
నిందితుడి మొబైల్ ఫోన్ ద్వారా మరింత సమాచారం బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కొంతమంది నిందితుల మొబైల్ ఫోన్లు దొరకలేదు.గత ఐదు రోజులుగా నటుడు దర్శన్ పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు. సరైన నిద్ర లేకుండా శారీరకంగా, మానసికంగా హీరో దర్శన్ కుంగిపోయాడు. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో దర్శన్ నిద్రపోయాడని, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచిన నటుడు దర్శన్ సొమ్మసిల్లిపడి కూర్చున్నాడని జైలు అధికారులు అంటున్నారు.
హీరో దర్శన్ జైలు సిబ్బంది ఇచ్చిన కాఫీ తాగి జైలు మెనూలోని స్నాక్‌ను తిన్నాడు. జైలు కూడుకు అలవాటు పడక పోయినా మరో మార్గం లేకుండా వాటిని తింటున్నాడని తెలిసింది. రెండు రోజుల క్రితం దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆయన కుమారుడు జైలుకు చేరుకుని హీరో దర్శన్ తో మాట్లాడారు. భార్య, కుమారుడు మాట్లాడిన తర్వాత దర్శన్ కొంచెం రిలాక్స్ అయ్యాడని, ఇప్పుడు మళ్లీ ఒంటరిగా కూర్చుని మౌనంలోకి జారిపోయాడని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications