క్యారవాన్‌లో స్టార్ హీరో రాసలీలలు ..ఇలాంటి వ్యక్తి దేవుడా..?
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ యువతి కోలీవుడ్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది.
కోలీవుడ్‌లో ఒక స్టార్ హీరోపై రమ్య మోహన్ అనే యువతి చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా, ఆమె ఆ హీరో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. 'కారవాన్ ఫేవర్స్' కోసం రూ. 2 లక్షలు, 'డ్రైవ్స్' కోసం రూ. 50 వేలు వంటి భారీ మొత్తాలను ఆఫర్ చేశారని రమ్య పేర్కొంది.

ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్‌లో ఉన్న తన స్నేహితురాలిని పరిశ్రమ నిబంధనల పేరుతో సంవత్సరాలుగా వాడుకున్నారని ఆమె ఆరోపించింది. తమిళ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాలు, లైంగిక సంబంధాలు లోతుగా పాతుకుపోయాయని, బాధితులను విస్మరించి మీడియా ఇలాంటి వారిని దేవుళ్లుగా చిత్రీకరిస్తోందని రమ్య విమర్శించింది. తన ట్వీట్‌లో నేరుగానే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పేరును ఆమె ప్రస్తావించింది.ఈ ఆరోపణలు వైరల్ అవ్వడంతో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, రమ్య తన మొదటి ట్వీట్‌ను డిలీట్ చేయడంతో అసలు నిజం తెలుసుకోవాలంటే సదరు స్టార్ హీరో స్పందించాల్సి ఉంది అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications