నటుడిని చితకబాదిన పక్కింటోడు, చెత్త వేశాడని దుమ్ములేశాడు, అసలు మ్యాటర్ !

కొంతకాలం క్రితం కన్నడ టీవీ సీరియల్ నటి లక్ష్మీ సిద్దయ్య అలియాస్ లక్ష్మీపై జరిగిన దాడి గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు తనపై దాడి జరిగిందని ఓ బుల్లితెర నటుడు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కన్నడ బుల్లితెర నటుడు చరిత్ బాలప్ప అలియాస్ చరిత్ అనే యువకుడు అతను నివాసం ఉంటున్న పొరుగువారిపై కేసు పెట్టాడు.

బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో నటుడు చరిత్ పై దాడి జరిగిందని కేసు నమోదు అయ్యింది.. ఈ ఘటన ఫిబ్రవరి 23న జరిగిందని, కానీ ఆలస్యంగా ఫిర్యాదు చెయ్యడంతో ఇప్పుడు కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. తన ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి గల కారణాన్ని కూడా నటుడు చరిత్ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఖాళీ స్థలంలో చెత్త వేసినందుకు తనను అవమానించారని, తన మీద దాడి చేశారని కన్నడ టీవీ నటుడు చరిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A youth from the same area who crushed the Kannada actor in Bengaluru

షూటింగ్ బయలుదేరి వెలుతున్న సమయంలో చెత్తను సమీపంలోని ఖాళీ స్థలంలో వదిలేశానని, ఆ క్రమంలో పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి తనతో గొడవ పడ్డాడని, దీంతో గొడవ పెరిగి పెద్దది అయ్యిందని, ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వాళ్లు తన మీద దాడికి పాల్పడ్డారని నటుడు చరిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్న కారణాలతో తన మీద వాళ్లు దాడి చేశారని నటుడు చరిత్ ఆరోపించాడు.

పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి తమను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టాడని నటుడు చరిత్ అతని ఫిర్యాదులో తెలిపాడు. తాను షూటింగ్‌లో ఉన్నందున ఇన్ని రోజులు ఫిర్యాదు చెయ్యడానికి సాధ్యం కాలేదని, అందుకే తాను ఆలస్యంగా వాళ్ల మీద ఫిర్యాదు చేస్తున్నానని నటుడు చరిత్ వివరించాడని పోలీసులు తెలిపారు. కన్నడ టీవీ నటుడు చరిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

A youth from the same area who crushed the Kannada actor in Bengaluru

బెంగళూరులో ఎక్కడపడితే అక్కడ చెత్త వెయ్యకూడదు అనే నియమాలు ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తవేస్తే వారీ మీద అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. బెంగళూరులో బీబీఎంపీ వాహనం వచ్చిన సమయంలోనే ఆ వాహనంలో చెత్త వేయాలి. అయితే చెత్త ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నటుడు చరిత్ పారవేయడం వలనే అతని మీద దాడి జరిగిందా ?, లేక మరేదైనా కారణం ఉందా అని బెంగళూరు పోలీసులు ఆరా తీశారు. అంతేకాకుండా దాడి జరిగిన స్థలంలో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+