పబ్లిక్‌గా అందరి ముందు భర్తతో గొడవపడ్డ ఐశ్వర్య రాయ్
ఐశ్వర్యరాయ్ తన భర్త,బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ ఎంత చెబుతున్నప్పటికి ఈ రుమర్లు మాత్రం ఆగడం లేదు.
అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది.

తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. విడాకుల వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఐశ్వర్యకు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ తెలిపారు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్‌లకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, అలాగే నవ్య నవేలి నందా ఐశ్వర్యతోనే ఉన్నారు. అయితే మ్యాచ్ మధ్యలో ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో ఇద్దరూ వాదించుకుంటూ కనిపించారు. అభిషేక్ బచ్చన్‌తో వాదన తర్వాత ఐశ్వర్యరాయ్ సైలెంట్ అయ్యింది. తర్వాత నవ్య నవేలి నందా కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించి సైలెంట్ అయిపోయింది. విడాకుల వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications