షూటింగ్‌లో ప్రమాదం.. గాయాలపాలైన హీరో నితిన్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రమాదానికి గురయ్యారు. తమ్ముడు సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరో నితిన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నితిన్ తీవ్ర గాయాలపాలయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా హీరో నితిన్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి.
వరుస పరాజయాలతో ఉన్ననితిన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు నితిన్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న తమ్ముడి చిత్రం దిల్ రాజు బ్యానర్‌లో రాబోతున్న సినిమా. ఈ సినిమాపై యంగ్ హీరో నితిన్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు. హీరో నితిన్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రాణమో తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్‌ను పెట్టడం జరిగింది. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. అందుకే ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

తమ్ముడు సినిమా షూటింగ్‌కు బ్రేక్ : ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలోని అడవీలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను తీసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నితిన్ చేతికి పెద్దగాయం అయినట్లు సమాచారం. దాంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. నితిన్ పరీక్షించిన వైద్యులు మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేకులు పడినట్లే. నితిన్‌కు మూడు వారాలపాటు విశ్రాంతి తప్పనిసరిగా అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications