అలీ షాకింగ్ కామెంట్స్..ఎన్నికలు పెడితే ఆయనే సీఎం
నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్‌గా చేస్తూ బిజీగా మారారు. ఇండస్ట్రీలో అలీకి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అలీ రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే వైసీపీలో చేరిన అలీ..పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా. నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. దీంతో అలీ ఇటీవల జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ , అలీ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమాలో అలీకి అవకాశం ఇచ్చారు.

అవకాశం లేకున్నా అలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్రయినా ఉంటుంది. ఆ పాత్రలు అలీకి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. పూరి జగన్నాథ్ ఆస్తులన్నీ సందర్భంలో అలీ ఆయనకు అండగా నిలిచారు. తాను సంతోషంగా ఉంటే ఒక బొకే.. బాధలో ఉన్నప్పుడు ఒక పెగ్ మందు మాత్రం పోసి వెళ్తాడని పూరీ చెబుతారు.తాజాగా పూరి జగన్నాథ్‌పై అలీ మరోసారి తన ప్రేమను బయటపెట్టారు. అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ఈవెంట్‌కు పూరి జగన్నాథ్‌తో పాటు, అలీ సైతం హాజరయ్యారు. ఈ సమయంలో అలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
అలీ.. మాట్లాడుతూ థాయ్‌లాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ , అక్కడ ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోమ్ మినిస్టర్ అయ్యేవారమని అలీ
వ్యాఖ్యానించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు..పూరి జగన్నాథ్ బీచ్‌లలో కూర్చొని కథలు రాసుకోవడం అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్‌లో షూట్ జరుపుకోవాల్సిందే. అంతేకాదు తనకు బ్యాంకాక్‌లో అభిమానులు ఉన్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరి జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఉద్దేశంతోనే పూరి జగన్నాథ్ అక్కడ పోటీ చేస్తే సీఎం అవుతారని అలీ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications