అమ్మాయి అలా చేసిందని నా మేనల్లుడు సూసైడ్ చేసుకున్నాడు - అలీ

తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'నటి 175' చిత్రంతో కెరీర్ ప్రారంభించినా హాస్యనటుడుగా వందలాది సినిమాల్లో తన ప్రత్యేకమైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు. కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో ఆయన నటించారు. అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా సత్తా చాటారు. పదుల సంఖ్యలో సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు.

సుహాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్.. ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. కొంతకాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న ఆలీ.. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. లేటెస్ట్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

actor-ali-shocking-comments-about-his-personal-life-goes-viral

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అలీ మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యేలా చేశారు. తన మేనల్లుడు అమ్మాయితో లవ్ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.

అలీ ఇంకా ఏమన్నారంటే.. ఈ సినిమాలో సుహాస్‌కు మామయ్య పాత్ర చేశాను. ఈ క్యారెక్టర్ విని నా మేనల్లుడు గుర్తొచ్చాడు అంటూ 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ వ్యక్తిగత సంఘటనను జ్ఞాపకం చేసుకున్నారు. మా అక్క చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి ఆమె కొడుకును మా అమ్మే పెంచింది. వాడు పెద్దయ్యాక ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆమె నో చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత మా అమ్మ, మేము ఎంతో బాధపడ్డామని అన్నారు.

ఈ సినిమా కథలో ఉన్న భావోద్వేగం కూడా నాకు ఎంతో దగ్గరగా అనిపించింది. ఆ కారణంగానే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. సుహాస్‌ను స్క్రీన్ మీద చూసినప్పుడు నా మేనల్లుడు గుర్తొచ్చాడు అని పేర్కొన్నాడు. కాగా ఈ మూవీలో సుహాస్, అలీ మధ్య ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

రామ్ గోధల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామాగా మన్ననలు పొందే అవకాశముంది. ఈ చిత్రంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌, మారుతి కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ ట్రైలర్ లో ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు భావోద్వేగాలను పంచింది. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+