బూతు.. బూతు.. బూతు.. ఇక తెలుగు సినిమాల పరిస్థితి ఇదేనా !!

బాహుబలి పుణ్యమా అని ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మన తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. కానీ మరో పక్క మాత్రం మాస్ అప్పీల్ కోసం ప్రస్తుతం ఇదే ట్రెండ్ అనే పిచ్చిలో హీరోలు లైన్ దాటుతున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకుల్లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విక్టరీ వెంకటేష్ నుంచి.. పక్కింటి అబ్బాయి అనేలా అనిపించే నేచురల్ స్టార్ నాని వరకు అందరూ రూట్ మార్చి బూతులతో రెచ్చిపోవడం చూస్తూ ఉంటున్నాం.

సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ తో ఒక్కసారిగా విమర్శలు మూటగట్టుకున్నారు. బూతులు, అసభ్యకరమైన కొన్ని పదాలు వెంకీ మామ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. అలానే యంగ్ హీరో నాని కూడా ఈ మధ్య పక్కదారి పట్టారు. హిట్ 3 లో బూతులతో రెచ్చిపోయిన నాని.. ప్యారడైజ్ చిత్రం స్టార్టింగ్ లోనే బిగ్ షాక్ ఇచ్చారు. ఇది ఒక ల***** కథ అంటూ చెప్పడం.. ఆయన చేతిపైన కూడా ల** కొ** అని పచ్చ బొట్టు ఉండడం ఇప్పటికీ షాక్ అని చెప్పొచ్చు.

actor-nandu-psych-siddhartha-movie-teaser-released

కాగా నటుడు నందు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 100% లవ్, ఆటోనగర్ సూర్య, పాఠశాల, పెళ్లి చూపులు, జయ జయ జానకి నాయకా వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోలో హీరోగా పేరు తెచ్చుకోడానికి చాలాకాలంగా కష్టపడుతున్నారు. రీసెంట్ గానే సవారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. నటుడిగా మంచి పేరున్నా కానీ స్టోరీ సెలక్షన్ లోనే తేడా కొడుతుందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

లేటెస్ట్ గా నందు హీరోగా నటిస్తున్న 'సైక్‌ సిద్ధార్థ' మూవీ తెరకెక్కింది. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు హీరో నందు కూడా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం గమనార్హం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ లో ఒక యువకుడి కథ అంటూ నందు పాత్రను పరిచయం చేశారు. ఇప్పటివరకూ క్లాస్ రోల్స్ లో కనిపించిన నందు.. ఈసారి కాస్త ట్రాక్ మర్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ టీజర్ లో దాదాపు ఎక్కువగా బూతులతో నింపేయడమే కాకుండా.. బీప్ సౌండ్స్ ఎక్కువగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+