రెండో పెళ్లికి రెడీ అయిన మరో స్టార్ హీరో
ఈ రోజుల్లో పెళ్లి , విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు.ఇక సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా మారింది పరిస్థితి. కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని సింగిల్‌గానే లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం తమ జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే హీరో నాగ చైతన్య తన రెండో పెళ్లిని ఎనౌన్స్ చేశారు. సమంతతో విడాకులు తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.
తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావించిన చైతన్య, శోభితతో ఆగస్టు 9న తన నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమిళ స్టార్ హీరో సైతం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులో హీరో ప్రశాంత్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. తెలుగులో కూడా ప్రశాంత్ సుపరిచితుడే.ప్రేమ శిఖరం,జీన్స్,జోడి, వంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ మూవీ ప్రశాంత్‌కు ఫుల్ పాపులారిటీని సంపాదించి పెట్టింది. అయితే ఆ తర్వాతే ప్రశాంత్ కెరీర్ గాడి తప్పింది.వరుస ఫ్లాప్‌లు ఎదురుకావడంతో ప్రశాంత్ స్టార్ హీరో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ అన్నయ్య క్యారెక్టర్‌లో కనిపించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ కూడా నటుడే. ఆయన గతంలో తమిళ సినిమాల్లో నటించారు. తాజాగా ఆయన తన కొడుకు రెండో పెళ్లి గురించి కీలక ప్రకటన చేశారు.
త్వరలోనే నా కుమారుడు మళ్లీ పెళ్ళి చేసుకోబోతున్నాడంటూ ఆయన చెప్పుకొచ్చారు. తొందర్లోనే మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతానని ఆయన మాటల్లో తెలిపారు. ప్రశాంత్ 2005లో గృహాలక్షి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో ప్రశాంత్ తన భార్యకు విడాకులిచ్చారు. దీంతో ఆయన రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ వయస్సు ప్రస్తుతం 51 ఏళ్లు. ఈ వయస్సులో కూడా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశాంత్‌పై సెటైర్లు వేస్తున్నారు.
-
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
నా మీద చేతులు వేశాడు, ఆ నరకం గుర్తొస్తే ఇప్పటికీ వణుకే: స్టార్ యాంకర్ -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
పెళ్లయ్యాక తొలి బర్త్‌డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు!












Click it and Unblock the Notifications