Raghava Lawrence: రైతుకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన రాఘవ లారెన్స్.. వీడియో వైరల్..
రాఘవ లారెన్స్ డ్యాన్స్, నటన, దర్శకత్వంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అయితే ఆయన రీల్ లైఫ్ లో నటనతో పాటు రియల్ లైఫ్ లో భారీగా అభిమానులను కూడబెట్టుకున్నాడు. లారెన్స్ ఆపదలో ఉన్న వారికి నేనున్న అంటూ భరోసా ఇస్తున్నారు. పది సాయం చేయడంలోనే తృప్తి ఉంటుందని ఆయన నమ్ముతాడు. అందుకే ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు.
ఎంతో మంది అనాథలు, వికలాంగులు, అభాగ్యులకు సహాయం చేశాడు, చేస్తున్నాడు. రాఘవ లారెన్స్ గొప్ప మనుస్సును మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా రాఘవ లారెన్స్ ఓ రైతు కుటుంబానికి సాయం చేశాడు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన ఓ పేద రైతుకు ట్రాక్టర్ అందించారు. ఇందుకు సంబంధించి లారెన్స్ ఓ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

ఆ రైతు తన చెల్లి భర్త చనిపోవడంతో వారి ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు. తాను ఆ రైతు కళ్లలో ఆనందం చూడాలని. టీమ్ తో వెళ్లి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తెలిపారు. రైతుకు ట్రాక్టర్ అందివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. లారెన్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"హాయ్ స్నేహితులు మరియు అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మా ప్రెస్ మీట్‌లో నేను చెప్పినట్లుగా, మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తాము. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించబడింది, అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఇప్పుడు తన కుటుంబాన్ని పూర్తిగా చూసుకుంటున్నాడు.
ఈ రోజు, అతను తన కొత్త ట్రాక్టర్‌ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం చూడాలని నేను వ్యక్తిగతంగా కోరుకున్నాను, కాబట్టి మేము అతనిని పిలిచి నా అబ్బాయిలతో కాని అందజేసాము. కలిసి పోరాడుతున్న మన రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!" అని ట్వీట్ చేశాడు
రాఘవ లారెన్స్ ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.
Hi friends and fans! I am excited to announce that Maatram's service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications