సమంతా - నాగ చైతన్య విడాకులకు కారణం రివీల్ చేసిన తెలుగు హీరో..!
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అక్కినేని నాగ చైతన్య సరసన "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోగా.. సామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

సమంత విడాకులకు కారణం అదే..!
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు మంచి ఫ్రెండ్ అని అందరికీ తెలిసిందే. చైతూతో విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో అండగా ఉన్నారని ఆకూడా సామ్ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన "గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ సమంత విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సమంత తనకు ఓల్డ్ ఫ్రెండ్ అని.. వారి మధ్య ఇప్పటికీ అదే స్నేహం కంటిన్యూ అవుతుందని తెలిపారు. తాను ఏదైనా స్క్రిప్ట్ రాస్తే ముందు సమంతకే ఇస్తానని తెలిపారు. ఇక సమంత ఫ్రెండ్ గా మాత్రమే బాగా సుపరిచితం కానీ పర్సనల్ విషయాలు ఎప్పుడు అడగలేదని వెల్లడించారు. అది పూర్తిగా తన నిర్ణయం అని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా మయోసైటిస్ వ్యాధికి గురి అయినప్పుడు ఆమె ఎంతో ఇబ్బంది పడిందని కానీ చాలా స్ట్రాంగ్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కిస్తుండగా.. ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అలానే ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో సమంత బిజీగా ఉన్నారు.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications