రానా వద్దన్న కథతో ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాడు!

సినీ పరిశ్రమల్లో ఒక కథను ముందుగా ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని రాసుకుంటారు. సదరు హీరోకు ఆ కథను వినిపించిన తర్వాత అనివార్య కారణాలతో చేయడానికి వీలుపడదు. కథ ఎంత బాగున్నప్పటికీ కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, తర్వాత కూడా వరుసగా సినిమాలను ఒప్పుకొని ఉండటం లాంటి కారణాలతో తనదగ్గరకు వచ్చిన మంచి కథలను ఎంతోమంది హీరోలు చేయకుండా వదిలేస్తుంటారు. అటువంటి కథలు మరో హీరో దగ్గరకు చేరుకొని సూపర్ హిట్లుగా నిలిచిన సందర్భాలు కోకొల్లలు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాద్వారా రానా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా చేయగలుగుతాడని పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో రానా కూడా పాన్ ఇండియా నటుడిగా అవతరించాడు. చాలావరకు తనదగ్గరకు వచ్చే పాత్రలన్నీ విభిన్నంగా ఉండటంతోపాటు భారీ బడ్జెట్ కథలే వస్తున్నాయి.

actor rana rejected darling movie

పాన్ ఇండియా రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా దేశవ్యాప్తంగా అందరి హృదయాలను మన ప్రభాస్ దోచున్నాడు. అలాంటి ప్రభాస్ దగ్గరకు డార్లింగ్ కథ ముందుగా రాలేదు. ఆ కథ రానా దగ్గరకు వెళ్లింది. అనివార్య కారణాలతో రానా చేయలేకపోవడంతో చివరకు ప్రభాస్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రభాస్ కెరీర్ లోనే ఒక మంచి చిత్రంగా డార్లింగ్ నిలిచింది. ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ వరుసపెట్టి భారీ చిత్రాలను చేసుకుంటూ వెళుతున్నాడు. అతని చిత్రానికి కనీస బడ్జెట్ రూ.300 కోట్లు అవుతోంది. బాహుబలి తర్వాత రానా ఒకరాజు ఒక మంత్రి చేసి సూపర్ హిట్ అందుకున్నారు. కొన్ని చిత్రాలు మాత్రం ఫ్లాపయ్యాయి. అయితే డార్లింగ్ సినిమా చేయలేకపోవడంద్వారా రానా ఒక సూపర్ హిట్ ను మాత్రం కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+