పబ్‌లు, పార్టీలకు వెళ్తోంది.. నటిని కత్తితో పొడిచి చంపబోయిన భర్త!
Shruti: కన్నడ టెలివిజన్ నటి, యాంకర్ మంజుల(స్క్రీన్ పేరు శ్రుతి)పై ఆమె భర్త అంబరీష్ కత్తితో దారుణంగా దాడి చేశాడు. జులై 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
దాడి వివరాలు ఇలా..
జులై 4న బెంగళూరులోని హనుమంత నగర్‌లోని వారి అద్దె ఇంట్లో ఈ దాడి జరిగింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అంబరీష్ మొదట శ్రుతిపై పెప్పెర్ స్ప్రే ఉపయోగించాడు. ఆమె కళ్లలో మంట పుట్టించి.. ఆ తర్వాత పక్కటెముకలు, తొడ మెడపై కత్తితో అనేక సార్లు పొడిచాడు. అంతే కాకుండా ఆమె తలను గోడకు కొట్టి హత్యాయత్నం చేశాడు. శ్రుతి కేకలు విన్న పొరుగు వారు వెంటనే జోక్యం చేసుకుని అంబరీష్ ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. శ్రుతిని వెంటనే విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొంది ప్రస్తుతం కోలుకుంటోంది. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.

దంపతుల మధ్య వివాదాలు
శ్రుతి "అమృతధారే" వంటి అనేక కన్నడ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.ఆమె 20 సంవత్సరాల క్రితం అంబరీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత 15 ఏళ్లుగా వీరి వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తాయి. ఆర్థిక విషయాలు, శ్రుతి వ్యక్తిగత ఎంపికలు, అంబరీష్ ఆమ ప్రవర్తనపై అనుమానాలు ఈ గొడవకు కారణాలు అని తెలిసింది. 3 నెలల క్రితం శ్రుతి తన భర్తపై హనుమంత నగర్ పోలీస్ స్టేషన్‌లో హింస, ఆర్థిక వివాదాలపై ఫిర్యాదు చేసింది. ఈ వివాదాలలో ఇంటి అద్దె డబ్బులపై కూడా గొడవలు జరిగాయి. జులై 3న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత వీరు మళ్లీ కలిసి జీవించడానికి అంగీకరించారు. అయితే ఈ రాజీ ఒక్క రోజు కూడా కొనసాగలేదు. మరుసటి రోజు జులై 4న పిల్లల కాలేజీకి వెళ్లిన సమయంలో అంబరీష్ ఈ దాడికి పాల్పడ్డాడు.
తన భార్యపై అంబరీష్ ఆరోపణలు
పోలీసుల విచారణలో అంబరీష్ తన భార్యపై పలు ఆరోపణలు చేశాడు. శ్రుతికి కుటుంబ బాధ్యతలు లేవని.. ఆమె తన ఇద్దరు పిల్లలపై తల్లి ప్రేమను చూపించలేదని.. ఎప్పుడుపడితే అప్పుడు పార్టీలు, పబ్‌లకు వెళ్లి ఇంటికి వచ్చేదని ఆరోపించాడు. ఇటీవల శ్రుతి కుంభమేళాకు వెళ్లి 15 రోజులు ఇంటికి రాలేదని..ఈ విషయంపై గొడవ జరిగిందని చెప్పాడు. అంతే కాకుండా శ్రుతి రూ.25లక్షల విలువైన అపార్ట్మెంట్ అద్దె రద్దు చేసి డబ్బుతో వెళ్లిపోవాలని ప్లాన్ చేసిందని.. ఈ విషయంలో జరిగిన గొడవలో ఆమెపై దాడి చేసినట్లు అంబరీష్ పోలీసులకు వెల్లడించాడు. హనుమంత నగర్ పోలీసులు అంబరీష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications