డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో శ్రీరామ్ అరెస్ట్
Hero Sriram Arrested in Drugs Case: తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నటుడు కొకైన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీని కోసం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలనే కోరికతో చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు.
శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్‌గా మార్చుకుని చిన్న చిన్న పాత్రల్లో నటించడం ప్రారంభించాడు. అనంతరం 'రోజా పూలు' అనే చిత్రంతో తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. "ఒకరికి ఒకరు" అనే సినిమాతో మంచి పేరు సంపాదించి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల శ్రీరామ్ "హరికథ" అనే వెబ్ సిరీస్‌లోనూ అలరించాడు.

ఈ సీనియర్ నటుడిని డ్రగ్స్ కేసులో చెన్నైలోని నుంగంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో నటుడు శ్రీరామ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం నుంగంబాకం పోలీస్ స్టేషన్‌కు శ్రీరామ్‌ను తరలించి సుమారు 2 గంటలుగా చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు విచారిస్తున్నారు.
మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. శ్రీరామ్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications