నితిన్ సినిమాలో ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్.. కట్ చేస్తే 100 కోట్ల హీరోగా ఎంట్రీ.. నితిన్ మాత్రం అక్కడే..!
బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. కెరీర్ స్టార్టింగ్‌లో నితిన్ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జయం, దిల్ వంటి హిట్లతో అప్పుడున్న హీరోలకు గట్టి పోటీనిచ్చారు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు నితిన్. పదేళ్ల తర్వాత ఇష్క్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి సక్సెస్ కాలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అతి కచ్చితంగా నితిన్. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకులతో సినిమాలు చేశారాయన. తన మొదటి సినిమా జయం. ఆ సినిమాకు దర్శకుడు తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడే.
ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు, ఎన్టీఆర్‌కు ఆది వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడుతో నితిన్ దిల్ సినిమా చేశాడు. దర్శకధీరుడు రాజమౌళితో సై, కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం, పూరీ జగన్నాధ్‌తో హార్ట్ ఎటాక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అఆ. ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి నితిన్ కెరీర్ ముందుకు సాగడం లేదు.నితిన్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉందనే చెప్పాలి. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్.

జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తర్వాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి.
అయితే నితిన్ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటించిన నటుడు మాత్రం ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఆ హీరో మరెవరో కాదు..నిఖిల్. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "హ్యాపీ డేస్" చిత్రంలో రాజేష్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే నితిన్ నటించిన సంబరం సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో కనిపిస్తాడు నిఖిల్. ఆ తర్వాత అతను హీరోగా మారి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించాడు. వాటిలో "యువత", "స్వామి రారా", "కార్తికేయ", "సూర్య వర్సెస్ సూర్య", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "కేశవ", "కిరాక్ పార్టీ", "అర్జున్ సురవరం", "కార్తికేయ 2" మరియు "18 పేజెస్" వంటి చిత్రాలు ఉన్నాయి.

నిఖిల్ తన కెరీర్‌లో అనేక అవార్డులను అందుకున్నాడు. అతను రెండుసార్లు నంది అవార్డును గెలుచుకున్నాడు.ఇక నిఖిల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ముఖ్యంగా "కార్తికేయ 2" సినిమాతో మనోడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. కానీ నితిన్ మాత్రం ఇంకా కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.












Click it and Unblock the Notifications