లిప్ కిస్ ఇష్టపూర్వకంగానే పెట్టా.. తర్వాత అభిప్రాయం మారుతోంది ?
లెజెండరీ నటుడు కమల్ హాసన్ - మణిరత్నం మళ్లీ కలసి తెరపై రాబోతున్నారు. వీరి కలయికలో వస్తున్న తాజా చిత్రం "థగ్ లైఫ్". ఇది గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌లో తెరకెక్కింది. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5, 2025న విడుదల కానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "నాయకుడు" మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ 38 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించగా అభిరామి, త్రిష హీరోయిన్స్ గా నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. కమల్ స్టైల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో కనిపించగా, ట్రైలర్‌లో యాక్షన్, భావోద్వేగాలు, రొమాన్స్ అన్నీ మిక్స్ అయ్యాయి. ముఖ్యంగా కమల్ హాసన్ - త్రిష మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, అభిరామితో లిప్ లాక్ ట్రైలర్‌కు హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే కమల్-అభిరామి లిప్ లాక్ సన్నివేశంపై సోషల్ మీడియాలో వివాదం తలెత్తింది. ఈ వయసులో కమల్ లిప్ లాక్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. కాగా దీనిపై స్పందించిన నటి అభిరామి ఒక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. చిత్రనిర్మాతల నిర్ణయాలను నేను గౌరవిస్తాను. ఆ సన్నివేశం నా సంపూర్ణ అంగీకారంతోనే చిత్రీకరించబడింది. ట్రైలర్‌ను చూసి తొందరగా తీర్పు చెప్పకండి అని అన్నారు.
సినిమా మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం మారుతుందని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సినిమా చూడండి అని కోరారు. కమల్ హాసన్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications