పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. పిక్స్ వైరల్ !
తెలుగు ప్రేక్షకుల మనసులను అందంతో, అభినయంతో కట్టిపడేసింది మలయాళీ బ్యూటీ " ఐశ్వర్య లక్ష్మి ". విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గాడ్సే, మట్టికుస్తి, పొన్నియన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త సహా పలు చిత్రాల్లో మెప్పించింది ఐశ్వర్య.
2022 ఏడాదిలో ఏకంగా 9 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ ఆడియన్స్ ని అలరిస్తుంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అయితే ఐశ్వర్య లక్ష్మి గత కొంతకాలంగా ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తో ప్రేమాయణం నడుపుతుందని.. అతనితో డేటింగ్ చేస్తుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఐశ్వర్య గర్భంతో ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో పెళ్లి కాకుండానే గర్భవతి అవ్వడం ఏంటని ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప్రముఖ నటి మలయాళ నటి శ్వాసిక ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.
అయితే ఆ ఫొటోల్లో ఉన్నట్టు ఆమె నిజంగా గర్భవతి కాలేదని.. కొత్త సినిమాలో రేఖ అనే క్యారక్టర్ కోసం అలా రెడీ అయ్యిందని క్లారిటీ ఇస్తున్నారు. రీసెంట్ గానే ఈమె 'మామన్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. విడుదల ఫేమ్ సూరి హీరో గా నటించిన ఈ సినిమా కొద్దిరోజుల క్రితం విడుదలై కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. అవి ఆ గెటప్ కి సంబంధించిన ఫోటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఐశ్వర్య.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న "సంబరాల ఏటి గట్టు" అనే చిత్రం లో హీరోయిన్ గా చేస్తుంది. రోహిత్ కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న మూవీని రీలజ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications