సోషల్ మీడియాలో అలియా భట్ అశ్లీల వీడియో వైరల్
డీప్ ఫేక్ వీడియోలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. డీప్ ఫేక్ వీడియో మొదటి బాధితురాలు హీరోయిన్ రష్మిక. ఆమె ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు.

బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను ఆ వీడియోలో కనిపించింది. ఈ ఘటన మరువక ముందే బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టు మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. రష్మిక మాదిరిగానే కాజోల్ ఫేస్ కూడా మార్ఫింగ్ చేసినట్టు స్పష్టం అవుతుంది. తాజాగా మరో హీరోయిన్ ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు సంబంధించినడీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యువతి ఫేస్‌కు అలియా ఫొటోను జతచేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూడగానే మనకు అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థం అవుతుంది. ఈ వీడియోలో అమ్మాయి అశ్లీల చేష్టలు చేస్తూ కనిపించింది. ఇందులో ఉన్న అమ్మాయి వివరాలు ఇంకా బయటకు తెలియలేదు.
తన ఫేక్ వీడియోపై హీరోయిన్ అలియా భట్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలకే ఇలా వేధింపులుఎదురవుతున్నాయంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications