స్టార్ హీరోతో ఎఫైర్..పెళ్లి కాకుండానే దర్శకుడి భార్య ప్రెగ్నెంట్

హీరోయిన్ అమలాపాల్ ఏం చేసిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే చెప్పాలి. అమలాపాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటికి, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. అయితే అమలాపాల్ విడాకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు జగత్ దేశాయ్‌ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

Actress Amala Paul Controversial Life Story

అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ఇటీవల అమలాపాల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అమలాపాల్‌ కాస్తా బోల్డ్‌గా కనిపిస్తోంది. వివాహమై మగ బిడ్డకు జన్మనిచ్చిన కూడా అమలాపాల్ అందాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటిలాగే తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఈ ఫొటోలను ఓసారి గమనిస్తే అమలాపాల్‌ కాస్తా బొద్దుగా మారినట్టు కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+