కమిట్ మెంట్ అడిగితే గొడవొద్దు: అనసూయ
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటికీ తీరని సమస్య. ప్రతి ఒక్కరికీ ఇది అనుభవంలోకి వస్తుంది. సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు కూడా తాము ఎదుర్కొన్న అనుభవాలను సోషల్ మీడియా వేదికగా, ఇంటర్వ్యూల్లో వెల్లడి చేస్తుంటారు. బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. అటువంటి ఇబ్బందులు తనకు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పింది.
ఒక సినిమా గురించి చర్చించడానికి వెళ్లినప్పుడు ఎదుటివారి ఉద్దేశం మొదట్లోనే మనకు అర్థమవుతుందని, మన నుంచి వారు ఏదైనా ఆశిస్తున్నారనిఅర్థమైనప్పుడు తనవరకైతే తన కుటుంబం, పిల్లలు, భర్త గురించి వారి ముందు మాట్లాడతానని, అప్పుడు వాళ్లు ఈ టాపిక్ తనముందుకు తీసుకురారంటూ చెప్పింది. పరిశ్రమలో ఉండాలి.. మన ప్రయాణం కొనసాగాలి.. అంటే ఎవరితోను వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా మాట్లాడాలని చెప్పింది. భవిష్యత్తులో వారు మనకు ఎదురైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని వివరించింది. కమిట్ మెంట్ విషయంలో కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించాలని అనసూయ చెప్పింది.

ఫైర్ బ్రాండ్ లా ముక్కు సూటిగా మాట్లాడే అనసూయ తనపై వచ్చే కామెంట్స్, ట్రోల్స్ పై ఫైరవుతుంటారు. అలాంటి అనసూయ కమిట్ మెంట్ అడిగే వాళ్ల నుంచి తెలివిగా తప్పుకోవాలని సూచించింది. గొడవలు పడటం సరికాదని చెప్పింది. సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప2 సినిమాలో అత్యంత శక్తివంతమైన మహిళగా కనపడబోతోంది.












Click it and Unblock the Notifications