Bhavana: తన భర్తతో విడాకులపై హీరోయిన్ భావన క్లారిటీ!

Bhavana: పలు తెలుగు చిత్రాలతో నటించిన హీరోయిన్ భావన తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. "మహాత్మ" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఒంటరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భావన.. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఇటీవల భావన గురించి వివిధ రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 2018లో ప్రముఖ కన్నడ నిర్మాత నవీన్ రమేష్ ను భావన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో భావన తన భర్త గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆమె విడాకులు తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. కొంత మంది కావాలని ఇలాంటి కథనాలను సృష్టిస్తున్నారని స్పష్టం చేశారు.

తనకు వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టం ఉండదని.. అందుకే తాను తన భర్తతో ఫోటోలు పోస్ట్ చేయనప్పుడల్లా కొంతమంది విడాకుల గురించి ఊహాగానాలు చేయడం మొదలు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తన వివాహ జీవితం చాలా బాగుందని.. అసలు విడాకులు తీసుకోవాలనే ఉద్దేశం మాకు లేదని భావన వివరించారు. తాను ఎక్కువగా వ్యక్తిగత గోప్యతకు ఎక్కువగా విలువ ఇస్తానని.. అందుకే ఫోటోలు బయటపెట్టనన్నారు. అంతదాకా ఎందుకు తాను ఒక సాధారణ ఫోటో షేర్ చేసినా.. దాని చుట్టూ కథలు అల్లుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారని వివరించారు. మా భార్యభర్తల బంధం బలంగా ఉందని నిరూపించుకోవడానికి ఫోటోలు షేర్ చేయాలా అంటూ ప్రశ్నించారు.

Actress Bhavana Clarifies Divorce Rumors Talks About Her Marriage and Career

కేరళకు చెందిన ఈ అందాల భామ తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైంది. ఈ ముద్దుగుమ్మ తమిళ్, మలయాళ, తెలుగు చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల క్రితం కొందరు దుండగులు భావనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 2017లో జరిగింది. అనంతరం ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2018లో వివాహం చేసుకున్నారు. సినిమాలకు దూరంగా ఉండడంపై కూడా ఆమె మాట్లాడారు. సినిమాలను తాను సీరియస్ గా తీసుకోలేదని.. ఈ క్రమంలోనే అవకాశాలు తగ్గినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+