హోటల్‌కు వెళ్దామని అతను బలవంతం చేశాడు..నాగార్జున హీరోయిన్ సంచలన కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పుకొచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు దర్శన బాణిక్. మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నటి బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. నాగార్జున, నాగచైతన్య నటించిన 'బంగార్రాజు' సినిమాలో స్వర్గంలో నాగార్జునతో కలిసి డాన్స్ చేసే నటీమణులలో ఈమె కూడా ఉంది. తెలుగులో పరుచూరి మురళి దర్శకత్వం వహించిన 'ఆటగాళ్లు' సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్‌గా నటించింది.

తాజాగా దర్శన బాణిక్ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ఒక బంగ్లాదేశ్ దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు దర్శనకి చేదు అనుభవం ఎదురైంది. ఏప్రిల్‌లో కథ చెప్పి, మే చివరిలో సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే, ఒకరోజు దర్శకుడు ఫోన్ చేసి "నువ్వు ఎక్కడున్నావ్? హీరోయిన్‌తో అగ్రిమెంట్ చేసుకున్నాక ఏ రిసార్ట్‌కి తీసుకెళ్తావ్?" అని అడిగాడట. ఈ మాటలు విని తీవ్ర ఆగ్రహానికి గురైన దర్శన, అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడొద్దని గట్టిగా బదులిచ్చింది. దానికి దర్శకుడు నువ్వు అంత సీరియస్‌గా ఉంటే ఇండస్ట్రీలో ఉండలేవని చెప్పాడట.
ఈ ఘటన తర్వాత దర్శన మాటలను సీరియస్‌గా తీసుకున్న ఆ చిత్రబృందం, సినిమా నుండి ఆమెను తొలగించింది. ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే, "నీకు వీసా సమస్యలు వచ్చాయి, అందుకే తీసేశాం" అని సమాధానం చెప్పారట. అయితే, దర్శనకు అసలు విషయం అర్థమైంది. తాను రిసార్ట్ గురించి సీరియస్‌గా మాట్లాడినందుకే తనను తొలగించారని. ఆ తర్వాత ఆ సినిమాలో మరో హీరోయిన్‌ను తీసుకున్నారు.
ఈ అనుభవం గురించి మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కష్టపడి పనిచేసేవాళ్లు ఉన్నారు, అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే మంచి స్థానంలో ఉంది. అయితే, అక్కడక్కడా కొంతమంది చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని బట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని అంచనా వేయలేము కదా? అని దర్శన బాణిక్ వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అది చాలా వరకు వాస్తవం అని ఆమె నిర్మొహమాటంగా వెల్లడించింది.
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications