అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ..
తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ బ్యూటీగా సుపరిచితురాలైంది "Divi Vadthya". తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి, నటిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందుకు సాగుతోంది. 2019లో Mahesh Babu నటించిన 'మహర్షి' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. అనంతరం 'A1 ఎక్స్‌ప్రెస్' వంటి సినిమాల్లో నటిస్తూ అవకాశాలు దక్కించుకుంది.
అయితే ఆమెకు నిజమైన బ్రేక్ తీసుకొచ్చింది మాత్రం Bigg Boss Telugu అనే చెప్పాలి. ఈ షో ద్వారా దివికి భారీ స్థాయిలో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కాయి. అదే క్రేజ్‌తో ఆమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. Chiranjeevi నటించిన 'గాడ్ ఫాదర్', Allu Arjun నటించిన 'పుష్ప 2' వంటి భారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మరింత ఫాలోయిగ్ పెంచుకుంది. దివి కెరీర్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 'రుద్రంగి' సినిమాలోని 'జాజిమొగులాలి' ఫోక్ సాంగ్. ఈ పాటలో ఆమె డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ వైరల్ అయి యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

అదేవిధంగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల ద్వారా కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. 'లంబసింగి' చిత్రంలో హీరోయిన్‌గా నటించినా, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ 'కర్మస్థలం'లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని రాకీ షెర్మన్ తెరకెక్కిస్తుండగా, తాజా పోస్టర్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దివి ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల దివి తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఒక పబ్లిక్ ఈవెంట్ సందర్భంగా బాడీగార్డ్స్ మధ్య ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను వెంటనే రియాక్ట్ అయి.. అతడికి తగిన బుద్ధి చెప్పానని తెలిపింది. "అప్పుడే స్పందించకపోతే అది తప్పును అంగీకరించినట్లే అయ్యేది" అని ఆమె స్పష్టం చేసింది.
ఈ ఘటన తర్వాత తనలో మార్పు వచ్చిందని, పబ్లిక్ ఈవెంట్స్‌లో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని దివి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా దివి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల ఫాలోవర్లతో, తన లేటెస్ట్ ఫోటోషూట్స్, సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఆమె స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ కూడా యువతలో మంచి క్రేజ్‌ను తెచ్చాయి.












Click it and Unblock the Notifications