Hema: రేవ్ పార్టీతో సంబంధం లేదు.. హైదరాబాద్ లోనే ఉన్న.. నటి హేమ..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీపై పోలీసులు దాడులు చేసి ఎండీఎంఏ, కొకైన్ పట్టుకున్నారు. ఈ పార్టీలీ ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో 25 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఈ పార్టీ జరిగింది. ఫామ్ హౌస్ వద్ద ఓ బెంజ్ కారులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పాస్ పార్టును గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుపై పాస్ పోర్ట్ లభ్యమైనట్లు చెబుతున్నారు. ఈ పార్టీలో టాలీవుడ్ నటి హేమ ఉందని వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. తాను హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేశారు. తనకు బెంగళూరు రేవ్ పార్టీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని చెప్పారు. తన గురించి కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

ఫామ్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ రేవ్ పార్టీ తెల్లవారుజాము 3 గంటల వరకు సాగింది. సమాచారంతో పోలీసులు దాడులు చేసి డ్రగ్స్, మద్యం పట్టుకున్నారు. అయితే పార్టీలో టాలీవుడ్ చెందినవారు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications