పబ్లిక్‌లో ఎన్టీఆర్ పాటకు చిందులు వేసిన జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది.

జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

Actress Janhvi Kapoor iifa 2024 dance video viral

తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి.

పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. జాన్వీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఐఫా వేడుకల్లో జాన్వీకపూర్ డ్యాన్స్ వేసిన ప్రోమోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పలు పాటలకు జాన్వీకపూర్ డ్యాన్స్ వేసినట్టు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో చూట్టమల్లే సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైట్ పింక్ కలర్ శారీతో దర్శనం ఇచ్చి రచ్చ రచ్చ చేసింది. కొంటె చూపులతో కుర్రకారు హృదయాల్లో చిచ్చు పెట్టేస్తోంది జాన్వీకపూర్. వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తుంది. .. తన అందచందాలతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+