పెళ్లి అయిపోయింది.. భర్త అతనే - జాన్వీ కపూర్

జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor).. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక బాలీవుడ్‌లో జాన్వీ తాజాగా నటించిన "పరం సుందరి" సినిమా విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ రిస్పాన్స్ మాత్రమే సాధించింది. అయినప్పటికీ ప్రమోషన్లలో మాత్రం జాన్వీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రమోషన్స్ లో భాగంగా తన పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

actress-janhvi-kapoor-interesting-comments-on-marriage-goes-viral

నాకు పెళ్లయింది - జాన్వీ

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డేటింగ్, ఫస్ట్ లవ్ అనుభవాలను పంచుకుంది జాన్వీ. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వెయిటర్లు, కొంతమంది తనను టార్గెట్ చేసేవారని చెప్పుకొచ్చింది. అడగకుండానే ఫుడ్ ఐటమ్స్ తెచ్చేవారని.. ఫోన్ నంబర్లు ఇస్తూ ఇబ్బంది పెట్టేవారని తెలిపింది. అప్పుడు తప్పించుకోవడానికి చాలా సార్లు తనకు పెళ్లి జరిగిందని.. 'ఓర్రీ' (Orry) తన భర్త అని చెప్పేదాన్ని" అని షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ఈ విషయం విన్నవారంతా స్టన్‌ అయ్యారు.

ఓర్రీ గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులకు ఇతను మంచి ఫ్రెండ్ అని తెలిసిందే. జాన్వీ, సారా అలీఖాన్, అనన్య పాండే సహా చాలా మందితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. అంతే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

actress-janhvi-kapoor-interesting-comments-on-marriage-goes-viral

పెళ్లిపై కామెంట్స్..

ఇక తన అసలు పెళ్లి గురించి కూడా జాన్వీ గతంలో పలు సార్లు తన బయట పెట్టింది. "తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. కాంచీవరం పట్టుచీర కట్టుకొని, అరటి ఆకులపై భోజనం పెట్టించాలి" అని తన కోరికను స్పష్టంగా తెలిపింది.

శిఖర్ పహారియాతో రిలేషన్‌షిప్..

ఇక జాన్వీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆమె శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎక్కడికైనా కలిసి వెళ్తూ, పబ్లిక్‌లో కపుల్‌గా కనిపిస్తుంటారు. దీంతో అభిమానుల్లో వీరి రిలేషన్‌పై ఆసక్తి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+