ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !!

తెలుగు సినీ పరిశ్రమలో బోల్డ్, నెగెటివ్ షేడ్స్‌ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. ఒకప్పుడు వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ముఖ్యంగా Evadi Gola Vadide సినిమాలో చెప్పిన "సమర్పించేసుకుంటాను" డైలాగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాలు ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు, టీవీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు..

ఓ ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించింది. అంతే కాకుండా ఓ స్టార్ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా మాట్లాడారనీ, సెట్స్ లో అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆమె వ్యాఖ్యానించిన దర్శకుడు ఎవరా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా ఆ దర్శకుడు మరెవరో కాదు, E. V. V. Satyanarayana అని ఆమె పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది.

actress-jyothi-comments-on-evv-satyanarayana-that-facing-uncomfortable-situation-at-movie-shoot

'కితకితలు' షూటింగ్‌లో సంఘటన..

జ్యోతి చెప్పిన వివరాల ప్రకారం Kithakithalu సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి షూటింగ్‌కు పిలిచారని తెలిపింది. కానీ సదరు పాత్ర గురించి ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆమె పేర్కొంది. షూటింగ్‌కు వెళ్లిన తర్వాతే అసలు సన్నివేశం గురించి తెలిసిందని చెప్పింది. ఆ సన్నివేశంలో వాంప్ పాత్రలో భాగంగా అందరి ముందూ చీర విప్పి మంచంపై పడుకోవాలని దర్శకుడు సూచించారని జ్యోతి వెల్లడించింది. సెట్లో యూనిట్ సభ్యులు, లైట్‌మెన్లు ఉన్న పరిస్థితిలో అలాంటి సీన్ చేయడం తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె తెలిపింది. "ఇది నాకు కంఫర్టబుల్‌గా లేదు, దయచేసి సీన్‌ను మార్చండి" అని కోరినా, తన అభ్యర్థనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

చివరికి తన స్వాభిమానాన్ని కాపాడుకోవాలనే నిర్ణయంతో, ఆ సన్నివేశంలో నటించకుండా షూటింగ్ నుంచి బయటకు వచ్చానని జ్యోతి స్పష్టం చేసింది. మేకప్ రూంకి వెళ్లి దుస్తులు మార్చుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయానని తెలిపింది. ఆ ఘటన తర్వాత ఆ దర్శకుడితో మళ్లీ పని చేయలేదని కూడా వెల్లడించింది. అయితే వ్యక్తిగతంగా ఆయనపై ద్వేషం లేదని, అది పూర్తిగా తన నిర్ణయమేనని చెప్పింది. కెరీర్ కోసం ఎలాంటి ఒత్తిడికీ లోనవ్వకూడదని జ్యోతి సూచించింది. ఒకసారి చేసిన పాత్ర జీవితాంతం గుర్తింపుగా మిగిలిపోతుందని, అందుకే నటులు తమకు నచ్చని సన్నివేశాలను ధైర్యంగా తిరస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+