హీరోయిన్ కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే ..?
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ సోమవారం ఉదయం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. బాలనటుడుగా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి కొన్ని సినిమాల్లో నటించారు.సూర్య కిరణ్ దాదాపు 200 సినిమాలకు పైగానే నటించారు.
తెలుగులో సుమంత్ హీరోగా నటించిన ''సత్యం'' సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యారు. హీరోగా సుమంత్ కెరీర్‌లో ఇదే హిట్ సినిమా కావడం విశేషం. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో ''ధన 51'' అనే సినిమా వచ్చినప్పటికీ అది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. 'బ్రహ్మాస్త్రం', 'రాజుభాయ్', 'చాప్టర్ 6' వంటి చిత్రాలకు సూర్య కిరణ్ దర్శకత్వం వహించారు.

హీరోయిన్ కల్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సూర్య కిరణ్ .. అభిప్రాయభేదాలు తలెత్తడంతో కొద్ది రోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. కల్యాణీతో విడిపోయిన తరువాత సూర్య కిరణ్ జీవితం మరింత ఆటుపోటులకు లోనైంది. ఆర్థికంగా కూడా సూర్య కిరణ్ చాలానే ఇబ్బందులను ఫేస్ చేశారు. దీంతో బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చారు. అయితే షోలో ఎక్కువ రోజులు కొనసాగలేక ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు.
గత కొన్ని రోజుల నుంచి కామెర్ల వ్యాధితో భాదపడుతున్న సూర్య కిరణ్.. ఆ వ్యాధి మరింత ముదరడంతో కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఆయన మరణంతో సిని ఇండస్ట్రీలో విషాధ చాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications