"అది తీసి చూపించమన్నారు".. కాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ రివిలేషన్!
చలనచిత్ర పరిశ్రమమలో తీవ్ర సంచలనం సృష్టించే 'కాస్టింగ్ కౌచ్' సంఘటనల గురించి ఇప్పటివరకు ఎంతో మంది నటీమణులు బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నటి కంగనా శర్మ కూడా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించి షాకిచ్చింది. కాస్టింగ్ ఏజెంట్ తన పట్ల ప్రవర్తించిన తీరు, చేసిన నీచమైన డిమాండ్ గురించి కంగనా శర్మ బహిరంగంగా వెల్లడించింది.
ప్రముఖ యాంఖర్ సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా శర్మ మాట్లాడుతూ.. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ 'హేట్ స్టోరీ' చిత్రం కాస్టింగ్ సమయంలో తనకు ఈ అనుభవం ఎదురైందని తెలిపింది. ఊర్వశి రౌటేలా, ఇహానా థిల్లాన్ నటించిన ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఓ రెస్టారెంట్లో కాస్టింగ్ ఏజెంట్‌తో సమావేశమైనప్పుడు ఆయన తన పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ పాత్రలు చేయడానికి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను చెప్పినట్లు కంగనా శర్మ తెలిపింది. 'హేట్ స్టోరీ' లేదా 'రాజ్' వంటి సినిమాల్లో ముద్దు ఘట్టాలు, శృంగార సీన్లు ఉంటాయని అందరికీ తెలిసిందేనని.. సినిమాలో నట పరంగా అలాంటి సన్నివేశాలు చేయడానికి నటీనటులు సిద్ధంగా ఉంటారని ఆమె స్పష్టం చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో నటులు ఎంతో గౌరవప్రదంగా ప్రవర్తిస్తారని.. కానీ ఆ కాస్టింగ్ ఏజెంట్ మాత్రం పరిధులు దాటి మాట్లాడాడని వెల్లడించింది.
నువ్వు ఎంత బోల్డ్ గా ఉంటావో నిరూపించుకోవడానికి నీ అండర్ గార్మెంట్(ప్యాంటీ) విప్పి చూపించాలంటూ ఆ కాస్టింగ్ ఏజెంట్ సిగ్గు లేకుండా డిమాండ్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ క్షణంలో తాను ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా ఆ వ్యక్తిగా గట్టిగా బుద్ధి చెప్పానని ఆమె వెల్లడించింది. తాను సమాధానం చెప్పే తీరు చూసి.. ఆమె ఒప్పుకోదని ఆ వ్యక్తి గ్రహించి.."నువ్వు ఎంత బోల్డ్ గా ఉంటావో చూడడానికే అలా అడిగాను" అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడని పేర్కొంది.
ఆ కాస్టింగ్ ఏజెంట్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా శర్మ.. "నేను నిన్ను ఇక్కడే కొట్టగలను. కానీ నాలాంటి ఎంతోమంది అమాయక అమ్మాయిలను నువ్వు ఈ విధంగా వేధించి ఉంటావు" అని నిలదీసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. కాస్టింగ్ పేరుతో ఛాన్సుల కోసం వచ్చే కొత్త నటీమణుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేధించే వారి ముసుగు తొలగించాలనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు కంగనా శర్మ వెల్లడించింది.














Click it and Unblock the Notifications