ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
ఈ రోజుల్లో ప్రేమ, ఎపైర్,పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారాయి. గతంలో సామాన్యుల జీవితాల్లో ప్రేమ పెళ్లి , విడాకులు అనేవి కనిపించేవి కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. అయితే ఈ రోజుల్లో సామాన్యుల జీవితాల్లో కూడా ఎఫైర్స్, విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సెలబ్రిటీలు పెళ్లి , విడాకులు అనేవి కామన్‌గా మారిపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అని విధంగా మారిపోయింది పరిస్థితి.
ఇక విడిపోయిన వారు మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదనే చెప్పాలి. ఓ హీరోయిన్ తాజాగా ఇదే పని చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న హీరోయిన్ ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.హీరోయిన్ మీరా వాసుదేవన్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. ప్రముఖ కెమెరామెన్ విపిన్‌ను ఆమె మూడో వివాహం చేసుకున్నారు.విపిన్‌తో గత ఐదేళ్లుగామీరా వాసుదేవన్ రిలేషన్‌లో ఉన్నారు. అయితే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు ఈ జంట. దీనికి సంబంధించి హీరోయిన్ మీరా తన సోషల్ మీడియాలో పెళ్లి వీడియోను షేర్ చేశారు.

తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి పరిచియం చేస్తూ..అతను అలత్తూరుకు చెందిన పాలక్కాడ్ వాసి. అతను DOP/ సినిమాటోగ్రాఫర్ (అందులో అంతర్జాతీయ అవార్డు విజేత). మే 2019 నుండి విపిన్, నేను కలిసి పని చేస్తున్నాము. గత సంవత్సరం కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. 21/04/2024న పెళ్లి చేసుకున్నాము. మీ అందరితో ఈ ఆశీర్వాదం కోసం అధికారిక వార్తను పంచుకుంటున్నా అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సుధీర్ఘంగా రాసుకొచ్చారు. అయితే ఆమెకు ఇప్పటికే రెండుసార్లు పెళ్లి అయి విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. మీరా వాసుదేవన్ పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications