అప్పుడు చెల్లిగా.. ఇప్పుడు జోడీగా.. మెగా మూవీలోకి అఫిషియల్ ఎంట్రీ !
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుండగా.. ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చి.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
అలానే సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలానే నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, అశ్వనీ దత్, దిల్ రాజు, నాగవంశీ.. దర్శకులలో వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, వశిష్ఠ, బాబీ, శ్రీకాంత్ ఓదెల పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది.

అలాగే ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై అనేక అప్డేట్స్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో చిరు సరసన మరోసారి నయనతార నటించనుందని.. కానీ ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మెగాస్టార్ - అనిల్ రావిపూడి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించి ఒక వీడియోను సైతం రిలీజ్ చేశారు. గతంలో చిరు, నయన్ కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గాడ్ ఫాదర్ చిత్రంలో అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి జంట స్క్రీన్ పై సందడి చేయనుంది.
Welcome back for the hatrick film #Nayanthara!
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2025
Glad to have you on board for our #Mega157 journey with @anilravipudi.
SANKRANTHI 2026 రఫ్ఫాడించేద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt https://t.co/2faZXKNYaq
అలానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు తీసుకునేందుకు డేల్ సెట్ చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మీద నమ్మకంతో నిర్మాతలు సైతం ఆ డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications