"హరిహర వీరమల్లు" నచ్చలేదు.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నిధి !
నిధి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' లో నటించింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు 5 ఏళ్లు పాటు తెరకెక్కిన ఈ మూవీకి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ నడుస్తోంది. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ కోసమే కమిటెడ్ గా ఉన్న నిధి.. ఆశలు ఆవిరి అయ్యాయని అనుకుంటున్నారు.
VFXపై విమర్శలు..
'వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్సులు, "కొల్లగొట్టినాదిరో" పాట, పోర్ట్ ఫైట్ సీన్, చార్మినార్ ఫైర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో కథనం కొంచెం సాగదీతగా అనిపించడం, వీఎఫ్‌ఎక్స్ బలహీనంగా ఉండటం, పవన్ లుక్స్ కొన్నిచోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి. సోషల్ మీడియాలో వీఎఫ్‌ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన VFX సన్నివేశాలు లేవని విమర్శకులు అంటున్నారు.

అయితే మూవీ యూనిట్ మాత్రం ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. మరోవైపు థియేటర్లను సైతం విజిట్ చేస్తూ సందడి చేస్తుంది. అందులో భాగంగానే నిర్మాత ఏఎం రత్నంతో కలిసి.. నిధి ఓ థియేటర్ కి వెళ్లిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఆ పోస్టుకి ఆ నెటిజన్ మాత్రం సినిమా నాకు నచ్చలేదు అంటూ కామెంట్ చేశాడు. అందుకు నిధి తనదైన శైలిలో రిప్లై ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఏం రిప్లై ఇచ్చిందంటే..?
నిధి మాత్రం అతనిపై ఏమాత్రం సీరియస్ అవ్వకుండా చాలా సింపుల్ గా రిప్లై ఇచ్చింది. పర్లేదు అండి.. అన్ బయాస్ గా ఉండే ప్రేక్షకులకు మూవీ నచ్చుతుంది అంటూ స్వీట్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది.
Randomly did a theatre visit yesterday to a houseful show and absolutely loved the energy and response #BlockBusterHHVM ❤️🔥🦅🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/SCv2hK3QXU
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) July 26, 2025
క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్ పుట్‌పై ప్రభావం చూపిందని అంటున్నారు. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా 70 కోట్ల గ్రాస్, 32.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి సెంటర్లలో టికెట్లకు భారీ డిమాండ్ ఉండగా, మొదటి రోజు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కలిపి 12.7 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. పవన్ కెరీర్‌లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటివరకు రావడం ఇదే తొలిసారి. కానీ రెండవ రోజు మాత్రం కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications