అక్క కంటే చెల్లి ఫాస్ట్.. ప్రభాస్ హీరోయిన్ పరిస్థితి ఏంటో ???
కృతి సనన్.. మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటనలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఆధారిత చిత్రాల్లోనూ రాణిస్తూ.. కొత్త తరానికి చెందిన టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.
2014లో బాలీవుడ్ చిత్రం 'హీరోపంటి'తో మొదలైన కృతి కెరీర్.. ఆ తర్వాత 'దిల్‌వాలే', 'రాబ్తా', 'బరేలీ కీ బర్ఫీ' వంటి చిత్రాలు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలానే ఈ బ్యూటీ కెరీర్‌లో కీలక మలుపు అంటే 'మిమి' చిత్రం. సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డు కూడా దక్కించుకుంది.

అలానే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. టాలీవుడ్‌లో '1: నేనొక్కడినే' సినిమాతో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. కృతి గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో కూడా కనిపించింది. అయితే హీరోయిన్ నుపుర్ సనన్.. కృతి సనన్ చెల్లెలు అనే విషయం తెలిసిందే. కానీ అక్క కంటే ముందు చెల్లికి వివాహం జరగడం హాట్ టాపిక్ గా మారింది.
నుపుర్.. తెలుగులో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించి ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఈ భామ.
కాగా ఇప్పుడు లేటెస్ట్ గా నుపుర్ సనన్ తన చిరకాల ప్రియుడు, ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారం రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.

ఈ కార్యక్రమంలో నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ ఇద్దరూ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. మినిమలిస్టిక్ డిజైన్‌తో సంప్రదాయం, ఆధునికత మేళవించిన లుక్‌లో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్, రాజస్థానీ శైలి అలంకరణలు పెళ్లి వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్..
వివాహం అనంతరం విడుదలైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. నుపుర్ - స్టెబిన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. పలువురు సినీ, సంగీత రంగ ప్రముఖులు, అలాగే నెటిజన్లు ఈ కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివాహంతో కృతి సనన్ గురించి బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి"











Click it and Unblock the Notifications