Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్లాప్ హీరోతో ఫ్లాప్ డైరెక్టర్ మూవీ.. ఇప్పుడు హీరోయిన్ కూడా ??

మాస్ మహారాజా రవితేజ.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు స్టార్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. సినిమా హిట్టా, ఫట్టా అనేది పట్టించుకోకుండా వరుసగా చేసుకుంటూ పోతూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గానే రవితేజ నటించిన చిత్రం "మాస్ జాతర" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రవితేజ 75 చిత్రంగా వచ్చిన ఈ సినిమాని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది.

కాగా వచ్చిన సినిమాలు వచ్చినట్లుగా పోతున్నా కూడా రవితేజ స్పీడ్ మాత్రం తగ్గట్లేదు. గత ఐదేళ్లలో ఆయన నటించిన చిత్రాలను పరిశీలిస్తే దాదాపు 10 సినిమాలు రిలీజ్ అవ్వగా.. క్రాక్, ధమాకా తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్ గానే నిలిచాయి. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలో క్యామియో రోల్ ఇచ్చి మెప్పించారు. కానీ రవితేజ మాత్రం ఇవేం పట్టనట్టు సినిమాలను పట్టాలెక్కిస్తూనే ఉన్నారు. రీసెంట్ గానే "భర్తమహాశయులకు విజ్ఞప్తి" అని కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

actress-priya-bhavani-shankar-in-raviteja-and-shiva-nirvana-movie

అయితే ఇప్పుడు రవితేజ మరో కొత్త సినిమాను కూడా ప్రారంభించినట్లు సమాచారం. నిన్ను కోరి, మజిలీ, ఖుషి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణతో ఆయన మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే శివ తెరకెక్కించిన చిత్రాల్లో నిన్ను కోరి పర్వలేదనిపించగా.. మజిలీ మంచి హిట్ అందుకుంది. కానీ ఖుషి మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఫ్లాప్ హీరోకి తోడు ఫ్లాప్ డైరెక్టర్ అవసరమా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భామకు కూడా తెలుగులో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఫీల్ అవుతున్నారు. అందరూ ఫ్లాప్స్ మూటగట్టుకొని మరో ఫ్లాప్ మూవీ తీస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

రవితేజ జోడీగా ప్రియ భవానీ శంకర్..

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్‌. మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక 2017లో మేయా దమాన్‌ అనే తమిళ సినిమా ద్వారా నటిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులోనూ కళ్యాణం కమనీయం మూవీతో ప్రేక్షకులను పలకరించి.. గోపీచంద్ తో 'భీమా', సత్యదేవ్ సరసన 'జీబ్రా' సినిమాల్లో మెప్పించింది. అలానే డబ్బింగ్ సినిమాలు ఇండియన్ 2, డిమోంటీ కాలనీ 2, బ్లాక్ తో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. వీటితో పాటు నాగ చైతన్య సరసన "ధూత" వెబ్ సిరీస్‌లో నటించింది.

actress-priya-bhavani-shankar-in-raviteja-and-shiva-nirvana-movie

అయితే ఆశించిన స్థాయిలో హిట్స్ రాకపోవడంతో కోలీవుడ్ ఆఫర్లతోనే కాలం నెట్టుకొస్తుంది ప్రియ. ప్రస్తుతం గత ఏడాది సక్సెస్ కొట్టిన డీమాంటీ కాలనీ2కి సీక్వెల్ గా వస్తున్న మూడో పార్ట్ లో నటిస్తుంది. మరి శివ నిర్వాణ - రవితేజ సినిమాతో అయిన ఈ బ్యూటీ హిట్ అందుకుంటుందా ? లేదా మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకుంటుందా అని జోరుగా చర్చ నడుస్తోంది. శివ నిర్వాణ - రవితేజ కాంబోలో వచ్చే మూవీ ఓ థ్రిల్లర్ అంటూ టాక్ వినిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+