నాకు సరైనోడు దొరికాడు..అతనితో మూడో పెళ్లి ప్రకటించిన స్టార్ హీరోయిన్
ఈ రోజుల్లో ప్రేమ, ఎపైర్,పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారాయి. గతంలో సామాన్యుల జీవితాల్లో ప్రేమ పెళ్లి , విడాకులు అనేవి కనిపించేవి కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. అయితే ఈ రోజుల్లో సామాన్యుల జీవితాల్లో కూడా ఎఫైర్స్, విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సెలబ్రిటీలు పెళ్లి , విడాకులు అనేవి కామన్‌గా మారిపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అని విధంగా మారిపోయింది పరిస్థితి.
ఇక విడిపోయిన వారు మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదనే చెప్పాలి. ఓ హీరోయిన్ తాజాగా ఇదే పని చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న హీరోయిన్ ఇప్పుడు మూడో పెళ్లితో వార్తల్లో నిలిచింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..రాఖీ సావంత్.బాలీవుడ్‌లో తనదైన శైలితో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఆమె నటించిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను అందుకున్నాయి.తెలుగులో '6 తీన్స్' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ఎంతో మందికి ఇష్టమైన పాటల్లో ఒకటి.రాఖీ సావంత్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. కష్టాలను ఎదుర్కొని, తన కలలను సాకారం చేసుకుంది. ఆమె తన జీవితం గురించి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన కష్టాలు, సంతోషాలు అన్నీ తెరపైకి తెచ్చింది.రాఖీ సావంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో నిత్యం సంకర్షణలో ఉంటుంది. తన ఫోటోలు, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటుంది.రాఖీ సావంత్ తన పెళ్లిళ్లతో కూడా వార్తల్లో నిలిచింది.
రాఖీ సావంత్ ఇప్పటి వరకు రెండుసార్లు పెళ్లి చేసుకుని, రెండుసార్లు విడాకులు తీసుకుంది.ఆమె మొదటి వివాహం గురించి అంతగా తెలియదు. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. రితేష్‌తో ఆమె రెండవ వివాహం బిగ్ బాస్ షోలో జరిగింది. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రితేష్‌తో ఆమెకు వివాదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా రాఖీ సావంత్ మూడవ వివాహానికి రెడీ అవుతోంది.
రాఖీ సావంత్ మూడో పెళ్లిపై సంచలన ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ''నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు'' అని రాసుకొచ్చింది. వీరిద్దరు త్వరలో పాకిస్థాన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ భామ తెలిపింది. ప్రస్తుతం రాఖీ సావంత్ మూడో పెళ్లి నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications