చాలామందితో ఎఫైర్స్ ఉన్నాయ్..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన ఎఫైర్ గురించి తానే బయటపెట్టుకుంది. ఆ భామ మరెవ్వరో కాదు హీరోయిన్ రెజీనా కసాండ్రా. సాయి ధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అదే హీరోతో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో నటించి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పలువురు యంగ్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ సినిమాలేవి కూడా రెజీనా కెరీర్‌కు ఉపయోగపడలేదు.
రెజీనా ప్రస్తుతం 'ఉత్సవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా నటించారు. అయితే దీనిని హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేష్ పాటిల్ నిర్మించారు. సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రెజీనా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది. అందరి జీవితాల్లో మాదిరిగా తన లైఫ్‌లో కూడా బ్రేకప్స్ జరిగాయని తెలిపింది. నేను నా వ్యక్తిగత జీవితాన్ని దాచిపెట్టను. నిజమే గతంలో చాలా మందితో రిలేషన్‌లో ఉన్నానని ఓపెన్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే నేను సీరియల్ డేటర్‌ని ఈ భామ తెలిపింది.
కానీ ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. రిలేషన్ షిప్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని సింగిల్‌గా ఉంటున్నా అని పేర్కొంది. నేను ఇలా ఓపెన్ గా మాట్లాడడం వల్ల చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ నా పర్సనల్ లైఫ్‌ని దాచిపెట్టడం ఇష్టం లేదు అని రెజీనా పేర్కొంది.రెజీనాపై గతంలో చాలా లవ్ ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోలతో ఈ భామ డేటింగ్ చేస్తోందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు తన డేటింగ్ గురించి నేరుగా రెజీనా కామెంట్స్ చేయడంతో గతంలో వచ్చిన వార్తలు నిజమే అన్న చర్చ సాగుతోంది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications