Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అది నా ఫోన్ నెంబర్ కాదు.. ఫ్యాన్స్‌కి కాంతారా బ్యూటీ రిక్వెస్ట్

రుక్మిణీ వసంత్".. చిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో అటు కన్నడతో పాటు తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

ఇక "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ, పెద్ద విజయం పొందలేకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి" సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా కానీ.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అలానే రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు.

actress-rukmini-vasanth-request-to-fans-about-phone-number-calls

కాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రుక్మిణి వసంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తన పేరు మీద కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు. 9445893273 నెంబర్ ఉపయోగిస్తూ ఒక వ్యక్తి అచ్చం తన లాగే మాట్లాడుతూ.. ఇతరులను సంప్రదించినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఆ నెంబర్ తనది కాదని తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు.

సదరు నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ లు వస్తే అవి పూర్తిగా ఫేక్ అని గుర్తించాలన్నారు. దయచేసి అలాంటి మెసేజ్, ఫోన్ కాల్ కు స్పందించవద్దని తెలియజేశారు. ఇలా ఒకరి పేరును ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుందని.. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారి పట్ల తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు. ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే నేరుగా తనని లేదా తన టీంను సంప్రదించాలని తెలిపారు.

ఎన్టీఆర్ తో సినిమా..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. అలానే ఈ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారని టాక్. మరోవైపు కోలీవుడ్ లో మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా చేయబోతున్నారని అందులో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+