ఎవరికీ కనపడకుండా ఏడ్చానంటున్న స్టార్ బ్యూటీ !!!
ప్రముఖ నటి సంయుక్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 'పాప్‌కార్న్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ కేరళ కుట్టి. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త.. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గానే 'అఖండ-2' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి సినిమాలో.. నిఖిల్ కి జోడీగా 'స్వయంభు' చిత్రాల్లో నటిస్తుంది.

మరోవైపు శర్వానంద్ తో 'నారీ నారీ నడుము మురారి', బెల్లం కొండ శ్రీనివాస్ తో ఒక చిత్రంలో చేస్తోంది. అంతే కాకుండా మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న 'రామ్' సినిమాలోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో మహారాణి.. దీ క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోనూ కీ రోల్ పోషిస్తోందీ ఈ భామ. అయితే 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు.
ఏమన్నారంటే..?
ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, 'నారీ నారీ నడుమ మురారి' ముక్కోణపు ప్రేమకథ కాదని సంయుక్త స్పష్టం చేసింది. ప్రేయసి, మాజీ ప్రేయసి, ప్రేమికుడి చుట్టూ సాగే ఈ కథ, మహిళలను ఎలా గౌరవించాలనే సందేశాన్ని సున్నితంగా ఇస్తుందని వెల్లడించారు. తాను 'దియా' పాత్రలో కనిపిస్తానని.. దర్శకుడు రామ్ అబ్బరాజు టెన్షన్ లేకుండా సినిమాను పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. సహనటి సాక్షి వైద్యని కూడా సంయుక్త ప్రశంసించింది.
ఇక భిన్న కథాంశాలతో ముందుకు సాగుతానని.. భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగిస్తానని తెలిపింది. బయోపిక్స్‌లో నటించాలనే కోరిక బలంగా ఉందని సంయుక్త పేర్కొంది. యామీ గౌతమ్ 'హక్' (Haq) చూసి స్ఫూర్తి పొందానని, ఫ్లైట్‌లో అది చూసి ఏడ్చానని వివరించింది. శక్తిమంతమైన మహిళల పాత్రలు చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని సంయుక్త ఆకాంక్షను వ్యక్తం చేసింది.
-
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ??












Click it and Unblock the Notifications