ఈ మేడంని గుర్తుపట్టారా.. అప్పుడు అలా .. ఇప్పుడు ఇలా ??
శ్రేయా ధన్వంతరి.. అక్కినేని నాగ చైతన్య నటించిన "జోష్" సినిమాలో ముఖ్య పాత్ర పోషించి టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన 'స్నేహగీతం' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ చిత్రాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. కాగా హిందీలో నటించిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' తో వెబ్ సిరీస్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఆమె పోషించిన జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అలానే మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ & డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే దుల్కర్ సల్మాన్‌తో 'చుప్' లో నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీలో బోల్డ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు ఉన్న నటీమణుల్లో ఒకరిగా శ్రేయా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం పలు హిందీ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే శ్రేయా తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పటివరకు సాఫ్ట్ లుక్‌తో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్ పాత్రలకూ కూడా సిద్ధమని సిగ్నల్ ఇస్తుంది. బోల్డ్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ, ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
గ్లామర్ డోర్లు తెరచి మునుపెన్నుడూ లేనంతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. దాంతో అమ్మడికి ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు. బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈమె ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరీ ఈ ఫోటో షూట్స్ చూసైన తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

ఇక ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్. ఇప్పటి వరకూ వచ్చిన రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ పై అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సీజన్-3 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మొదటి రెండు సీజన్ల కంటే మరింత ఉత్కంఠభరితంగా, భారీ స్థాయిలో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ 3వ సిరీస్ లో జైదీప్ అహ్లావత్ మెయిన్ విలన్ గా కనిపించారు. షరీబ్ హష్మీ, నిమ్రత్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించగా.. శ్రేయా ధన్వంతరి, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, సందీప్ కిషన్, విపిన్ శర్మ సహా పలువురు ఇతర పాత్రలు పోషించారు.












Click it and Unblock the Notifications