ఒక రోజుంతా నాతో గడుపుతావా..? స్టార్ హీరోని చెప్పుతో కొట్టిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ... కళ్లు జిగేల్ మనే కాంతులు, కోట్ల అభిమానం, అంతులేని సక్సెస్. ఇక్కడ స్థిరపడాలంటే ఘోరమైన తపస్సు చేయాలి, అనుక్షణం ఈ ప్రపంచంలోనే బతకాలి. హీరోల జీవితం ఒక శిల్పంలా మలచబడి, వారి కెరీర్ దశాబ్దాల పాటు సాగుతుంది. కానీ, హీరోయిన్ల కెరీర్ మాత్రం పది సంవత్సరాలకే పరిమితం.
ఈ సక్సెస్ వెనుక కొన్ని భయంకరమైన సత్యాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కథనం సినీ పరిశ్రమలోని అత్యంత చీకటి కోణాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.

పరిశ్రమలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక స్టార్ హీరో ఒక యువ హీరోయిన్‌పై మనసు పడ్డాడట. కేవలం ప్రేమ మాత్రమే కాదు, అతడు తన అధికార బలంతో ఆ హీరోయిన్‌కి సినిమాలో అవకాశం ఇవ్వడానికి ఒక కఠినమైన కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏమిటంటే... తనతో ఒక రోజంతా గడపాలి.
ఆమెకు ఈ ప్రతిపాదన విని కోపం కట్టలు తెంచుకుంది. పక్కన ఉన్న కొందరు వ్యక్తులు, ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం, రాజీ పడాలంటూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. చివరకు ఆ హీరోయిన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. ఏకంగా ఆ స్టార్ హీరోను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి బయటపడిందట.
ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయంటూ కథనాలు వెలువడుతుంటాయి. కానీ, అసలు ప్రశ్న ఏమిటంటే... సమాజంలో మంచి గౌరవం, కోట్ల అభిమానం, పేరు ప్రఖ్యాతులు ఉన్న కొందరు స్టార్ హీరోలు ఇలాంటి అనైతిక చర్యలకు ఎందుకు పాల్పడతారనేది అసలు ప్రశ్న.
ప్రతి ఒక్కరికి భార్యా పిల్లలు ఉన్నారు, సుదీర్ఘమైన కుటుంబ జీవితం ఉంది. ఇంట్లో భర్తగా, తండ్రిగా ఉన్న వీరు... వృత్తిపరంగా వచ్చేసరికి తమ హోదాను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి కండిషన్లు పెట్టడానికి గల కారణం ఏమిటో అర్థం కాదు. ఇది కేవలం అధికార దుర్వినియోగమా ? లేక నైతిక పతనం? అనేది ఎవరికీ అర్థం కాని అంశం.
సినిమా మేధావులు సైతం ఇలాంటి చర్యల వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని, మహిళలకు భద్రత లేకుండా పోతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగుల ప్రపంచం, గ్లామర్ వెనుక దాగి ఉన్న ఈ చీకటి నిజాలు పరిశ్రమ పరువును, విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు ఎంత పెద్ద స్టార్లైనా, వారు తమ జీవితంలో నైతిక పతనాన్ని చవిచూడక తప్పదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications